హైదరాబాద్: 28°C
వ్యాపారం

రిలయన్స్ వైఖరిని మెచ్చుకున్న మస్క్

శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో 'స్టార్‌లింక్'‌తో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ ప్రకటనపై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. రిలయన్స్ వైఖరిని ప్రశంసిస్తూ 'ఎంతో అభినందనీయం' అని మస్క్ బదులివ్వడం విశేషం. తాము పోటీకి భయపడబోమని, జియో శాటిలైట్ సేవలు సైతం అనుమతుల కోసం వేచి చూస్తున్నాయని, ప్రతి సంస్థ భారత చట్టాలకు లోబడి పనిచేయాల్సిందేనని రిలయన్స్ పేర్కొంది.