హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,47,660కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,35,350 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.