హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్‌ను తనిఖీ చేసిన ప్రోగ్రాం మేనేజర్

NZB: కమ్మర్పల్లిలో 108 అంబులెన్స్ వాహనాన్ని శనివారం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర వైద్య పరికరాల పనితీరును, రికార్డులను పరిశీలించారు. ఈఎంటీ సంతోష్, పైలట్ రమేశ్కు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణుల అత్యవసర పరిస్థితులు, పాముకాటు వంటి సందర్భాల్లో మండల ప్రజలు 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.