హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి కుక్కల దాడి.. బాలుడికి గాయాలు

NDL: దొర్నిపాడు గ్రామంలో కుక్కల బెడద పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వీధి కుక్కల దాడిలో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలతో పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరారు.