హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపై యువకుడి మృతదేహం

ప్రకాశం: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం కాంట్రగుంట రోడ్డు పక్కన కొండపై శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య చేశారా? ఇతర కారణాలతో చనిపోయాడా? అనే కోణంలో ఆయన దర్యాప్తు చేపట్టారు.