హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రకాళికి చేరుకున్న మంత్రి

WGL: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం శ్రీ భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, దేవదాయ శాఖ అధికారులు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.