హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో పిట్టల శ్రీలత–శ్రీనివాస్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇవాళ సర్పంచ్ ఎర్రల జానకిరాజు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, ఇంటి నిర్మాణానికి పంచాయతీ తరఫున సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.