హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామచంద్రపురం కూటమి అభ్యర్థిగా మేడిశెట్టి

కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మేడిశెట్టి శేషారావును టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శేషారావు 30 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని శేషారావు ధీమా వ్యక్తం చేశారు.