హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం

PLD: మాచర్లలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు.