MNCL: కోటపల్లి మండలం నాగంపేటలో సంతోష్పై హత్యాయత్నానికి పాల్పడిన తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఇరువురి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో 15న పొలం నుంచి తిరిగి వస్తున్న సంతోష్పై తిరుపతి గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్


