హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పోలీస్ కార్యాలయాల్లో క్లీన్ అండ్ గ్రీన్

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు, అన్ని పోలీస్ స్టేషన్‌లలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్, పరిసరాలను శుభ్రం చేసి, ఫైళ్లను క్రమబద్ధీకరించారు. 5ఎస్ విధానాన్ని పాటిస్తూ.. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, విధుల్లో క్రమశిక్షణతో పాటు, రికార్డుల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు.