BPT: వేటపాలెం మండలం కొత్తపేటలో రహదారులపై పశువుల సంచారం ప్రమాదకరంగా మారింది. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదుట, సరస్వతి పాఠశాల సమీపంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓ గోమాత మృతి చెందగా, ఆవు దాడిలో మహిళ తప్పించుకుంది. విశ్రాంత ఎస్ఐ వెలుగోలు రామకోటేశ్వరరావు తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాలకు నిలయంగా కొత్తపేట రహదారి


