హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరమ్మతులకు నోచుకోని చేతిపంపు..!

BHNG: ఆలేరు మండలంలోని కొలనుపాక లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఉన్న చేతిపంపు మరమ్మతులకు నోచుకోవడం లేదు. చేతిపంపులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ వినియోగంలోకి రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో పూర్తిస్థాయిలో నీరు అందించిన ఈ చేతిపంపునకు మరమ్మతులు చేపడితే నీటి సమస్య తీరుతుందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.