HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోతున్నాయి. అపార్ట్మెంట్లు జలమండలి నీటిపైనే ఆధారపడుతున్నాయి. సాధారణంగా డిసెంబర్ తర్వాత 500-600 MGDలుగా ఉండే నీటి డిమాండ్ ఈసారి అక్టోబర్లోనే 700 MGDలకు చేరింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు.
తెలంగాణ
గ్రేటర్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు!


