MLG: కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలానికి చెందిన నాలుగేళ్ల బాలిక ప్రణవిపై కుక్క దాడి చేసి కరిచింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ కళ్యాణ్, పైలట్ సతీష్ ప్రథమ చికిత్స అందించి బాలికను ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
నాలుగేళ్ల బాలికపై కుక్క దాడి


