హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం రథయాత్ర: రెడ్డి జేఏసీ

SDPT: అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వర్తింపజేయాలని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల మహా పాదయాత్ర చేపడుతున్నట్లు జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.