హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ల తొలిరోజు హింసపై ఎంపీ శబరి ఆగ్రహం

NDL: నామినేషన్ల తొలి రోజే పుంగనూరులో వైఎస్సార్సీపీ హింసకు పాల్పడిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతో దాడులు చేశారని, అక్రమ ఆయుధాల వినియోగం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అతిక్రమించే వారెవరినీ ఉపేక్షించేది లేదని ఎంపీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలు పాటించాలని MP పేర్కొన్నారు.