SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి, మండపంలోని అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఈవో రమాదేవి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో మంత్రి సతీమణి పూజలు


