హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్వాడ, మిర్జాగూడలో ‘వన్ డే – వన్ వార్డ్’

RR: నార్సింగి సర్కిల్–45 డిప్యూటీ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి 'వన్ డే – వన్ వార్డ్'లో భాగంగా జన్వాడ, మిర్జాగూడల్లో పర్యటించారు. ఫిరంగి నాలా సమస్య, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు, వీధిదీపాలు, దోమల నివారణ, మార్కెట్ తరలింపు, వైద్యశాల, ఆలయ భూముల పరిరక్షణపై ప్రజలు వినతులు ఇచ్చారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, మౌలిక వసతులకై అధికారులను ఆదేశించారు.