BHNG: రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల పువ్వులను సేకరించి బతుకమ్మను అందంగా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


