హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదాపూర్‌లో వృథాగా భగీరథ నీరు

నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్‌లో మిషన్ భగీరథ తాగునీరు పది రోజులుగా వృథాగా పోతోంది. గ్రామంలోని పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడి నీరు రోడ్డు పక్కన నిలిచిపోతోందని గ్రామస్థులు తెలిపారు. ఎల్ నినోతో కరువు ముప్పు ఉందని ప్రభుత్వమే హెచ్చరిస్తున్న వేళ తాగునీరు నేలపాలు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే లీకేజీ అరికట్టి శాశ్వత మరమ్మతులు చేయాలని కోరారు.