హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరివెళ్లలో ఎమ్మెల్యే పర్యటన

NDL: సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 10వ వార్డుకు చెందిన ఫయాజుద్దీన్, హుస్సేన్ బాషా, రౌఫ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి భూమా అఖిలప్రియ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.