హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనపర్తి పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

WNP: జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ బతుకమ్మ ఆడిపాడి కోలాటాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ అన్నారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.