హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లి స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

WGL: నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌ను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శంఖ్వార్ ఐపీఎస్ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.