హైదరాబాద్: 28°C
వార్తలు

పెన్షన్ అదాలత్‌ విజయవంతం: శాంతిప్రియ

అనంతపురం కలెక్టరేట్‌లో 2 రోజుల పాటు నిర్వహించిన పెన్షన్, GPF అదాలత్ విజయవంతమైందని ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో 75 పెన్షన్, 111 జీపీఎఫ్ అథరైజేషన్లు జారీ చేయగా, 160 ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారం చూపినట్లు వెల్లడించారు. మిగిలిన అర్జీలను పూర్తిగా పరిష్కరించే వరకు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.