హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా అట్ల బతుకమ్మసంబరాలు

KMR: చుక్కాపూర్లో అట్ల బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో రంగురంగుల పూలతో తయారు చేసి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.