హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరు సమన్వయంతో వ్యవహరించాలి

కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామస్థులకు ఎస్సై సురేష్ బాబు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ఐ కోరారు.ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.