HYD: బాచుపల్లిలో డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. మమతా ఆసుపత్రి ఎదురుగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని 6.2 గ్రాముల MDMA, 5.83 గ్రాముల గంజాయి, రెండు ఐఫోన్లు, వెయింగ్ మెషీన్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న మరికొందరి కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసింది.
తెలంగాణ
డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు


