హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా గుజరాత్‌కు ఈగల్ టీం ర్యాలీ

SRPT: మాదక ద్రవ్యాల నిర్మూలన, జాతీయ ఐక్యతను చాటడమే లక్ష్యంగా ఏపీకి చెందిన ఈగల్ టీం గుజరాత్‌కు ర్యాలీగా బయలుదేరింది. సూర్యాపేట చేరుకున్న ఈ బృందానికి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య ఈరోజు ఘన స్వాగతం పలికారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత, ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.