హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐడీఓసీలో కోలాటంతో సందడి చేసిన ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి ఐడీఓసీలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోలాటం ఆడుతూ సందడి చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి పాటలు, ఆటల్లో పాల్గొంటూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.