W.G: భీమవరం పాత బస్టాండ్లోని అన్న క్యాంటీన్ బిర్యానీపై యూట్యూబ్లో ప్రసారమైన వార్త అవాస్తవమని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. బిర్యానీలో మసాలా దినుసులను పురుగులుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. సిబ్బంది, ప్రజలను విచారించగా వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ బిర్యానీపై ప్రచారం అవాస్తవం: కమిషనర్


