హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి విక్రయాలపై దాడులు ముగ్గురు అరెస్ట్

KMM: ఖమ్మం 3 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేసి 1.115 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబాబు తెలిపారు. గంజాయి సరఫరా చేసి విక్రయిస్తున్నారనే కేసులో బానోత్‌ సంజయ్‌, బానోత్‌ దేవి, సంతోష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు.