రాత్రి పూట పెరుగు తినడం మంచిదా కాదా అని కొందరు సందేహ పడుతుంటారు. అయితే, ఈ విషయంలో ఆహార నిపుణుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. రాత్రి సమయంలో పెరుగుతో తింటే కఫాన్ని పెంచి, జలుబు ఉన్నవారికి ఇబ్బంది కలగొచ్చని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. అలాగే, తగిన మోతాదులో తీసుకుంటే ప్రోటీన్, ప్రోబయోటిక్స్ అందుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. జీర్ణ సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.
ఆరోగ్యం
రాత్రి పెరుగు తినొచ్చా?.. నిపుణులు ఏమంటున్నారంటే?


