హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం: అడిషనల్ డీసీపీ

NZB: మహిళలు, బాలికల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్ డీసీపీ ఎన్. శుభం ప్రకాష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మహిళా రక్షణ విభాగాల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను, యువతులను వేధించే వారిపై షీ టీమ్స్‌తో నిఘా పెంచాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.