హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పినకోటలో 104 వైద్య శిబిరం

ASR: అనంతగిరి మండలం పినకోట గ్రామంలో 104 అంబులెన్స్ ద్వారా వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 78 మందికి వైద్య సిబ్బంది పలు రక్త పరీక్షలు చేశారు. 104 అంబులెన్స్ ద్వారా 41 రకాల ఆరోగ్య పరీక్షలు అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.