హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు

SRPT: సూర్యాపేట జిల్లా పోలీస్ ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు ఈరోజు సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళా సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ కె. నరసింహ ఆటపాటల్లో పాల్గొన్నారు. పండుగలు సంస్కృతికి ప్రతీకలని, సిబ్బందిలో ఒత్తిడి తగ్గించి ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అందరికీ బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో అధికారులు, ఎస్ఐలు పాల్గొన్నారు.