KNR: దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని కరీంనగర్ 52వ డివిజన్లో శుక్రవారం పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ సరిళ్ల రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులకు చీరలు, బట్టలు అందజేశారు. నగర పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల సేవలు మరువలేనివని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ కార్మికులకు దుస్తుల పంపిణీ


