హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప శిల్పకళకు అమెరికా పర్యాటకుడు ఫిదా!

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయ శిల్పకళా వైభవం అమెరికా పర్యాటకుడు కార్ల్ రౌస్‌ను ఆకట్టుకుంది. శుక్రవారం రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆయనకు గైడ్ విజయ్ ఆలయ విశిష్టతలు, శిల్పకళా సౌందర్యాన్ని వివరించారు. అద్భుతమైన శిల్పాలను చూసి ఆయన మంత్రముగ్ధులయ్యారు. స్టేట్ గైడ్ శశి ఆయన వెంట ఉన్నాడు.