విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో ప్రజలు తమ అర్జీలను కలెక్టరేట్ పనివేళల్లో హెల్ప్డెస్క్లో సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ ముగిసే వరకు PGRS రద్దు


