హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు

NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ మహిళ ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మలు వేస్తూ సందడి చేశారు. బతుకమ్మ పాటలతో కలెక్టరేట్ మొత్తం దసరా సంబరాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ఏవో చంద్రశేఖర్ వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు‌.