హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి: MLA

MBNR: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న కురుమూర్తి జాతరకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలన్నారు. భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం కల్పించాలన్నారు.