హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాన్సువాడలో స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు

KMR: బాన్సువాడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి. విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వీట్ షాపులు, బేకరీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. FSSAI లైసెన్స్ లేని దుకాణాలను గుర్తించడంతో పాటు, పరిశుభ్రత లోపాలపై వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రజలు పరిశుభ్రత పాటించే దుకాణాల్లోనే కొనుగోలు చేయాలన్నారు.