హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలే వేయాలి: దాసరి హరిచందన

NLG: రాబోయే యాసంగి సీజన్‌లో బోర్లు, బావుల కింద వరి సాగు చేయవద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన రైతులకు సూచించారు. కనగల్ మండలం శేరిలింగోటం గ్రామంలో నీరందక ఎండిపోయిన వరి, పత్తి పంటలను కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గిపోయిందన్నారు. యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు.