హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BHPL: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో సత్కరించారు.