NZB: వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఆరుగురిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులలో బంగ్లా నర్సా గౌడ్, లోకేష్, పాకాల శ్రీనివాస్ గౌడ్, తోకల మధునిత, శివన్షి, వర్ధన్ ఉన్నారు. వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేసి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు. వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అమీనాపూర్లో పిచ్చికుక్క స్వైరవిహారం


