హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో సరస్వతి దేవి పూజలు

SKLM: నరసన్నపేటలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సత్యవరం అగ్రహారంలో జై దుర్గాభవాని టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో సరస్వతీ పూజలు ఘనంగా జరిగాయి. నరసన్నపేట పట్టణం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, విద్యార్థులు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేశారు. పై చదువుల్లో రాణించాలని విద్యార్థులు మొక్కగా, చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు.