హైదరాబాద్: 28°C
తెలంగాణ

లయోలా అకాడమీలో ఘనంగా సువర్ణ బతుకమ్మ వేడుకలు

MDCL: అల్వాల్ లయోలా అకాడమీలోని ఇనిగో హాల్‌లో గురువారం సువర్ణ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఫాదర్‌ డా. ఎన్‌.బి. బాబు ఎస్‌జే, ఫాదర్‌ డా. ఎ.ఎం. జోసెఫ్‌ కుమార్‌ ఎస్‌జే సమక్షంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటారు.