హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, సదుపాయాలను పరిశీలించారు. ప్రజలు శస్త్ర చికిత్సల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నందున శస్త్ర చికిత్సలు పెంచాలని ఆదేశించారు.