హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాల్దరి గ్రామాభివృద్ధికి రూ.5.83 కోట్లు: మంత్రి

EG: గత రెండున్నరేళ్లలో కాల్దరి గ్రామ అభివృద్ధికి రూ.5.83 కోట్ల నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ శుక్రవారం తెలిపారు. ఉండ్రాజవరం మండలంలోని కాల్దరి గ్రామంలో పల్లె పండుగ 1.0 కింద 9 పనులు పూర్తి చేశామన్నారు. పల్లె పండుగ 2.0 కింద రెండు పనులు కొనసాగుతున్నాయన్నారు.