EG: కడియం పరిసర ప్రాంతాల్లో నర్సరీ రైతుల మోటార్ వైర్ల దొంగతనాలను అరికట్టాలని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులను కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కడియం సీఐ అల్లు వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. దొంగతనాల వల్ల రైతులకు ఆర్థిక నష్టంతో పాటు నర్సరీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు.
వార్తలు
దొంగతనాలు అరికట్టాలని వినతి


